![]() |
![]() |

తమన్నా ప్రధాన పాత్ర చేసిన 'జీ కర్దా' వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైం వీడియోలో జూన్ 15 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. కాంటెంపరరీ రొమాన్స్ డ్రామాగా రూపొందిన ఈ సిరీస్ ట్రైలర్ ఈరోజు రిలీజయ్యింది. ట్రైలర్ ప్రకారం ఇది ఏడుగురు చిన్ననాటి స్నేహితుల కథ. 30 ఏళ్ల వయసు వచ్చినప్పడు తమ జీవితాలు ఓ కొలిక్కి వస్తాయని వారు భావిస్తారు.
అయితే, 30 ఏళ్లు నిండిన తర్వాత, తాము అనుకున్న దానికి భిన్నంగా జీవితం ఉందని గుర్తిస్తారు. వారు జీవిస్తారు, ప్రేమిస్తారు, నవ్వుతారు, కలిసి తప్పులు చేస్తారు, వారి హృదయాలను బద్దలు చేసుకుంటారు, కొద్దిగా ఎదుగుతారు. అయితే వీటన్నిటి ద్వారా, ఉత్తమమైన స్నేహాలు ఏమిటనేవి తెలుసుకుంటారు. అనుబంధాలు అసంపూర్ణమైనవని అర్థం చేసుకుంటారు. జీవితం చాలా కఠినమైనదనే వాస్తవం గ్రహిస్తారు.
మద్దోక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై దినేశ్ విజన్ నిర్మించిన ఈ సిరీస్‌ను అరుణిమా శర్మ డైరెక్ట్ చేసింది. ఏడుగురు బాల్య స్నేహితులుగా తమన్నా భాటియా, ఆషిం గులాటి, సుహైల్ నయ్యర్, అన్యా సింగ్, హుస్సేన్ దళాల్, సాయన్ బెనర్జీ, సంవేదనా సువల్కా నటించారు. సిమోన్ సింగ్, మల్హర్ థాకర్ కీలక పాత్రలు పోషించారు. లావణ్య (తమన్నా)కు ప్రపోజ్ చేస్తాడు రిషబ్ (సుహైల్). వారి పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు మిగతా ఐదుగురు స్నేహితులూ వస్తారు. కానీ కొన్ని ఘటనలతో వారి అనుబంధాలు అనూహ్యమైన మలుపు తీసుకుంటాయి.
ఇంతదాకా కనిపించని బోల్డ్ రోల్‌లో తమన్నా ఇందులో కనిపించనుందని తెలుస్తోంది. సుహైల్‌తో కొన్ని వేడి వేడి సీన్లలో ఆమె నటించింది. ట్రైలర్‌లో దానికి సంబంధించిన ఆనవాళ్లు బాగానే కనిపించాయి. ఓటీటీ ప్లాట్‌ఫాంపై ఇలాంటి సీన్లకు మంచి ఆదరణ ఉంది కాబట్టి 'జీ కర్దా' సిరీస్ ఆడియెన్స్ ఆదరణ పొందే అవకాశాలు బాగానే ఉన్నాయి.
![]() |
![]() |